అనుమతి లేకున్నా..
ఆ విద్యాసంస్థలపై అభిమానం ఎందుకు?
చర్యలు తీసుకోకుండా తీసుకున్నామంటూ ప్రకటనలు జారీ చేస్తే సరిపోతుందా
విద్యార్థుల భవిష్యత్తు అంటే విద్యా శాఖ పట్టింపు లేదా?
బోర్లు తీసేయాలని మున్సిపల్ శాఖకు సమాచారం ఇచ్చం : ప్రవీణ్ కుమార్, డిఇఓ
మహబూబ్ నగర్, మార్చి 9 (విజయక్రాంతి): అనుమతి లేకుండా కార్పొరేట్ పాఠశాలలంటూ ప్రచారం చేసుకుని ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించిన విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అస్సలు పట్టించుకోవడం లే దంటూ ఆరోపణలు ఊపొందుకున్నాయి. గత కొన్ని నెలలుగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై భారీ ఎత్తున హో ర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలను సైతం ఆ పాఠశాలలో ముమ్మరం చేశాయి. విద్యాసంఘాల ప్రతినిధులు ఈ విషయంపై పలుమార్లుజిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు ఆర్జేడికి, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యా దు చేసినట్లు తెలుస్తుంది.
విద్యాశాఖ రాష్ట్ర అధికా రులు ఆ విద్యాసంస్థలకు తెలిసినప్పటికీ నియమ నిబంధనలు పాటిస్తూ ముం దుకు సాగితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని విద్యార్థి సంఘాల నాయకు లు చెబుతున్నారు. ఇలాంటి అనుమతులు లే కుండానే ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్, ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రభు త్వ అనుమతి లేకుండానే నడుస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యం త్రాం గం అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరు తుండ్రు.
చెప్పేదొకటి... చేసేదొకటి
జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతు న్న దానికి చేసే దానికి అసలు సంబంధం ఉండడం లేదని కొన్ని విద్యార్థి సంఘాలు చె బుతున్నాయి. అనుమతి ఉన్న లేకపోయినా విద్యాశాఖ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి ఈ పాఠశాలలో అనుమతి లేదని చెప్పాల్సింది పోయి విద్యార్థి సంఘాలు అనుమతి లేదు అని నొక్కి చెబుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్నామని ఊరికే చెబుతూ కాలయాపన చేస్తున్నారని కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు అంతర్లీనంగా స్వాగతం పలుకుతున్నారని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ సెక్రెటరీ భరత్, నాయకులు కేశవులు, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దోమ వెంకట్ పేర్కొంటున్నారు
- ప్రచార బోర్డులు తీసేయాలి : ప్రవీణ్ కుమార్, డిఇఓ
అనుమతి లేని పాఠశాలలకు సంబంధించి పట్టణంలో ఎక్కడైనా హోల్డింగ్లు ఏ ర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని మున్సిపల్ శాఖకు రాతపూర్వకంగా చెప్పడం జరి గింది. అనుమతి లేని పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులను తల్లిదండ్రులు చేర్పించకూడదు. ఈ విషయంపై ఉన్నత అధికారులు సైతం విచారణ చేయాలని చెప్పడం జరిగింది ఆ విషయంపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం.




