calender_icon.png 29 July, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి కంపెనీపై కేసు.. ఎందుకు పెట్టలేదు?

29-07-2025 01:45:56 AM

  1. యాజమాన్యంతో సీఎం కుమ్మక్కు! 
  2. నెలరోజులైనా పరిహారం ఎందుకు ఇస్తలేరు? 
  3. కమిటీ రిపోర్టు ఎక్కడ? 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపాటు
  5. బాధితులతో కలిసి నిరసన 

సంగారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో ౫౪ మం ది కార్మికులు మృతిచెంది, నెల రోజులవుతున్నా బాధిత కుటుంబాలకు సీఎం ప్రక టించిన రూ.కోటి పరిహారం ఎందుకు ఇవ్వ డం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్ర శ్నించారు. యాజమాన్యంతో సీఎం ఎందు కు లాలూచీ పడుతున్నారని ధ్వజమెత్తారు. కంపెనీ యాజమాన్యంతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం బాధిత కుటుంబ సభ్యులతో కలసి సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి నెల రోజులు అయినా మృతదేహాలు ఇవ్వకపోవడం, ఎక్స్‌గ్రేషియా, డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం దారుణమ న్నారు.

ఏపీ, బీహార్, యూపీ, జార్ఖండ్ వలస కార్మికుల మృతదేహాలను నూనె డబ్బాల్లో పంపిండం ఏమిటని ప్రశ్నించారు. మృతులకు కోటి, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిగాచి ఘటనలో 54 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నదన్నారు.

సీఎం కోటి రూపాయల పరిహారం ప్రకటించినా, ఒక్కరికి కూడా ఇవ్వలేదని, అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవా లు ఇవ్వని దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. బూడిదను గోదావరిలో కలిపామని కుటుంబాలు రోధిస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్స్‌గ్రేషియా, డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు అని బాధితులు అడిగితే, ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో శవాలు కూడా రాలేదు, మీకు బూడిదైనా దొరికింది అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని బాధితులు కన్నీరు పెట్టుకుంటూ చెపుతున్నారని వాపోయారు. ఏపీ, బీహార్, జార్ఖండ్, యూపీ నుంచి రావడానికి, ఇక్కడ ఉండేందుకు రూ. 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. 

ఎందుకు దాస్తున్నారు?

సిగాచి కంపెనీ యాజమాన్యంతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని హరీశ్‌రావు ఆరోపించారు. నెల గడిచినా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులు అనేది అధికారికంగా వెల్లడించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నదని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు నష్టపరిహారం వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యంగా ఉంచా రో సమాధానం చెప్పాలన్నారు. చనిపోయిన జగన్మోహన్ కొడుకు యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదులో సిగాచి కంపెనీలో పాత మిషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనేక సార్లు కార్మికులు చెప్పినా కంపెనీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదైనా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నిం చారు.

నెల గడుస్తున్నా ఈ ఘటన మీద సమీక్ష చేయ రా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లడం, రావడం తప్ప ఏనాడైనా బాధతో ఒక రివ్యూ చేశారా అని నిలదీశారు. సిగాచి ఘటనలో 8 మంది మృతదేహాలు ఇవ్వలేదు, బొక్కలు ఇవ్వలేదు, బూడిద ఇవ్వలేదని విమర్శించారు.

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకో వడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సిగాచి ఘటనపై హైకోర్టులో సైంటిస్ట్ ఫర్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ బాధితులకు పరిహారం ఇవ్వాలని రిట్ పిటిషన్ వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు.