29-07-2025 01:46:56 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
నాగారం, జూలై 28 : నిజమైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వా లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో గల ఆనంద గార్డెన్ లో ఆహార భద్రత, ఇందిరమ్మ ఇళ్లు ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం 60 సంవత్సరాలు పార్లమెంటులో కోట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గరీబ్ హటావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తున్నదన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు.కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్ని పథకాలలో సముచిత స్థానం కల్పిస్తూ, పారదర్శకంగా లబ్ది చేకూరుతుందన్నారు.
10 సంవత్సరాల ఇండ్లు ఇస్తామని మభ్య పెట్టిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు. ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, ఆ తరువాత నేడు రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయన్నారు.
తదుపరి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే గృహోత్తర పథకం, ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హత కలిగిన వారికి ఈ రెండు పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ ప్రమాణ కొలతల ప్రకారం చేపట్టాలన్నారు.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరి అయిన వారు వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు.
వాటి నిర్మాణానికి ఉచిత ఇసుక రవాణా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు సిద్దార్థ, యాదగిరి, తహసిల్దార్ హరి కిషోర్ శర్మ, ఎంపిడిఓ మారయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ చింతరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సహకార సంఘం చైర్మన్లు పాలేపు చంద్రశేఖర్, కుంట్ల సురేందర్ రెడ్డి, గుడిపాటి సైదులు,వైస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి నాగారం మండల పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.