14-02-2026 12:00:00 AM
చేర్యాల, ఫిబ్రవరి 13: చేర్యాల మున్సిపాలిటీలో 2వ వార్డులో బిఆర్‌ఎస్ పార్టీ నుండి కమలాపురం గీతాంజలి,కాంగ్రెస్ పార్టీ నుండి కాటం తేజ ఎన్నికల బరిలో ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న గీతాంజలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్న క్రమంలో పోలీసు కానిస్టేబుల్ గా ఉన్న గీతాంజలి భర్త రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే నెపంతో పోలీసులు అధికారులు అతడిని విధుల నుంచి సస్పెం డ్ చేశారు.
అతని సస్పెండ్‌కు అధికార కాం గ్రెస్ నాయకులు ప్రమేయం ఉందని భార్య ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్ర హం ముందు నిరసన చేపట్టారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఉన్న గీతాంజలి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 223 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటం తేజ పై ఘన విజయం అందుకున్నారు.