బీజేపీ, బీఆర్ఎస్‌లకు బీసీ నేతను సీఎం చేసే దమ్ముందా..?
హైదరాబాద్,(విజయక్రాంతి): టిపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అధ్యక్షతన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం(OBC State Executive Committee Meeting) గాంధీభవన్(Gandhi Bhavan)లో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ ఓబీసీ సెల్ ఛైర్మన్ అజయ్ సింగ్(National OBC Cell Chairman Ajay Singh) పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister of State for Home Affairs Bandi Sanjay)కు సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు తెస్తామని, ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టించే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే దమ్ముందా..?, దేశవ్యాప్త కులగణనకు మోదీని అడిగే సత్తా ఉందా..? అని మహేశ్ గౌడ్ అడిగారు. దేశంలోనైనా.. రాష్ట్రంలోనైనా భవిష్యత్తు బీసీలదే అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు బీసీ నేతను ముఖ్యమంత్రి చేయగలవా..?, బీసీ నేతను సీఎం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.




