31 March, 2026 | 2:18 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

17-02-2025 05:21 PM

కోటి 30 లక్షలు పోగొట్టుకొని

కామారెడ్డి యువకునీ ఆత్మహత్య

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ ఓ యువకుడు డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవుని పల్లిలో చోటుచేసుకుంది. దేవునిపల్లికి చెందిన చాకలి చింటూ(27) అనే యువకుడు గత కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ అప్పుల పాలయ్యాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల్లో కోటి 30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో రాత్రి ఇంట్లో అందరు పడుకున్న తర్వాత అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కుటుంబీకుల సమాచారం ఘటన స్థలానికి చేసుకున్న దేవుని పల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.