30 March, 2026 | 11:10 PM

బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

17-02-2025 04:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఫిబ్రవరి 27న జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలకు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ  కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం పెద్దపల్లి నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హజరై మాట్లడారు. బలహీనవర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్ధేశ్యంతో 1931 తర్వాత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టామని పేర్కొన్నారు.

విపక్షాలు కులగణనను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని, కులగణన లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే విపక్షాలు తప్పుబడుతున్నాయని బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో అప్పుల కూప్ప చేస్తే వాటికి ఇప్పుడు మేము వడ్డీలు కడుతునే, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులు వ్యవసాయం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్నా రుణాలను ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాపీ చేశామని తెలిపారు.