4 July, 2026 | 8:07 AM

ఆ లోపు భారత్ అభివృద్ధి చెందుతుందా?

21-05-2024 02:15 AM

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 

ముంబై, మే 20: జీ దేశాల్లో భారత్ వేగమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్నా.. వాటితో పోలిస్తే పేద దేశమనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. లేబర్ ఫోర్స్ భాగమైన యువతకు సరైన ఉద్యోగావకాశాలు కల్పిస్తే.. దేశం మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. జీడీపీ విషయంలో ఇటీవలే యూకేను భారత్ దాటేసిందని, దీంతో ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తు చేశారు. త్వరలోనే జపాన్, జర్మనీని కూడా దాటేసి మూడో స్థానంలోకి ఎగబాకుతుందని పేర్కొన్నారు. అయితే 2047 నాటికి ప్రస్తుతం ఉన్న యువత వృద్ధాప్యంలోకి అడుగుపెడుతుందని, అప్పటిలోపు భారత్ ధనిక దేశం అవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. 6 శాతం వృద్ధి రేటుతో అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.