అంగారక ముందుకు కదిలేనా?
కరీంనగర్, మే31(విజయక్రాంతు):అంగారిక టౌన్షిప్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసురేందుకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాసంబంధిత అధికారులతో పనుల పురోగతిపై స మీక్ష నిర్వహించడంతో పెట్టె దారుల్లో ఆశలు చిగురించాయి కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నుస్తులాపూర్ రెవెన్యూ శివా రు, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్ లో నా లుగు సంవత్సరముల క్రితం ఆనాటి ప్రభు త్వం సుమారు 85 ఎకరాల స్థలాన్ని రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ అంగారికి టౌన్షిప్ పేరిట ప్రభుత్వ వెంచర్గా 819 నివాసప్లాట్లుగా చేసి బహిరంగ వేలం లో అమ్మకం చేసినారు.
ఆ సందర్భంగా అప్ప టి జిల్లా కలెక్టర్, జె.సి.లు 3 సార్లు ప్రిబిడ్ సమావేశాలు నిర్వహించి డి.టి.సి.పి. మరి యు హెచ్. ఎమ్.డి.ఎ. ప్రణాళికల ప్రకారం అంగారిక టౌన్షిప్ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి పరుస్తామని దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హామి ఇచ్చినారు. అం దులో భాగంగా ఇన్స్టర్నల్ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌఖర్యం ముఖద్వార నిర్మాణం, పార్కు అభివృద్ధి చేస్తామని తెలిపినారు. ఆ మేరకు బ్రోచర్లు, ఫ్లెక్సిలు మరియు పత్రికా ప్రకటనల ద్వారా జిల్లా అంతట ప్రచారంగావించినారు.
అధికారులు మరియు ప్రభుత్వ హామీలను విశ్వ సించి ప్రజలు ఉత్సాహంగా వేలంలో పా ల్గొని ప్రభుత్వం గజం కనీస ధర రూe 6,000-లు నిర్ణయిస్తే ఔత్సాహికులు గరిష్టం గా రూ. 22,400 వరకు కొందరు పాటపాడి పాటాపోటీగా ప్లాట్లు కొనుగోలు చేసా రు. సగటుగా 15 నుండి 16 వేల వరకు గజానికి అమ్మకం జరిగి, ప్రభుత్వానికి మొత్తంగా రూ. 147 కోట్ల ఆధాయం సమకూర్చబడినది. అలాగే అక్కడ ఉన్న స్థానిక మార్కెట్ రేటు ప్రకారం ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకుండా,
కొనుగోలు రేటు ప్రకారంగా రిజిస్ట్రేషన్లు చే సుకోవడం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 12 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చినది. వాయిదాలు చెల్లించడంలో ఆల స్యం జరిగితే పెనాల్టీ రుసుములు కూడా వ సూలు చేసారు అంగారిక టౌన్షిప్ లో 819 ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరు అల్పాదాయ వర్గాలవారు, దిగువ మధ్యతరగతి వర్గాల వారు, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పట్టణములో ఇళ్ళులేక, నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేక కోటి ఆశలతో బ్యాంకు లోనులు తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేసారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ వెంచర్లో భద్రత ఉంటుంది, అభివృద్ధి చెందుతుందన్న ఆశతో కొనుగోలు చేయడం జరిగింది.
కాని దానికి భిన్నంగా అభివృద్ధి లేక, పట్టించుకునే అధికారులు లేక ప్లాటు ఓనర్లు తీవ్ర నిరాశలో, ఆసంతృప్తిలో ఉన్నారు.ఈ మేరకు అంగారక టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పోరాటం ప్రారంభించారు. కనీస స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయము కల్పించబడలేదు.ఈ విషయంలో మూడు సంవత్స రాలుగా మంత్రులను, ఎమ్.ఎల్.ఎ లను, జిల్లా కలెక్టర్ లను పలు ధఫాలుగా కలిసి ప్రాతినిద్యం చేయడం జరిగింది. స్పందన రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఆయితే తాజాగా కలెక్టర్ సనీక్షించడంతో ఆశలు చిగురించాయి.






