ఎన్‌హెచ్ 163కి గ్రీన్ సిగ్నల్ వచ్చేనా?
- చెన్పైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో ముగిసిన ఫైనల్ హియరింగ్
- ఇరువర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
చేవెళ్ల, డిసెంబర్ 13: పెండింగ్‌లో ఉన్న ఎన్‌హెచ్ 163 (హైదరాబాద్-బీజాపూర్ హైవే)పై చెన్సైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫైనల్ హియరింగ్ ముగిసింది. శుక్రవారం ఫైనల్ హియరింగ్ ఉండటంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పట్ల్లోళ్ల కార్తీక్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద్దోళ్ల ప్రభాకర్, మాజీ వైప్ ఎంపీపీ శివప్రసాద్, చేవెళ్ల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి తదితరులు చెన్నై వెళ్లారు.
మధ్యాహ్నం హియరింగ్ మొదలు కాగా.. దాదాపు మూడు గంటల పాటు వాదోపవాదనలు జరిగాయి. ఈ వాదనలు విన్న న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు(ఎన్‌హెచ్ 163)కి అడ్డంకిగా నిలిచిన కేసు (ఓఏ నెం.262/2024) విషయంలో చెన్నైలోని ఎన్‌జీటీ ముందు వాదనలు ముగిశాయని..
రోడ్డు విస్తరణలో జాప్యం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సంభవిస్తున్న ప్రాణనష్టం గురించి ట్రిబ్యూనల్ ముందు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమర్థవంతంగా వాదనలు వినిపించారని.. ట్రిబ్యునల్ తుదితీర్పును రిజర్వ్ చేసిందని.. ఎన్‌హెచ్ 163కి సంబంధించి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని నేతలు తెలిపారు.






