గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం
14-12-2024 12:00 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది. రూరల్ మండలం రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గతరాత్రి బ్యాంకు వెనకాల గోడకు రంధ్రం చేసి, లోపలికి వెళ్లేందుకు దుండగులు యత్నించారు.
వెంటనే సైరన్ మోగడంతో పరారయ్యారు. శుక్రవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందిం చారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ జీవన్‌రెడ్డి పరిశీలించారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎ స్పీ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.






