26 May, 2026 | 10:39 AM

పథకం ప్రకారమే దంపతుల హత్య

14-12-2024 12:05 AM
  • 8 మంది అరెస్ట్ 
  • 8 తులాల బంగారం సీజ్ 

ఖమ్మం, డిసెంబర్ 13 (విజయక్రాంతి): నేలకొండపల్లికి చెందిన వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణకుమారిల హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్‌దత్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.

ఖమ్మం బోగంకుంట బజార్‌కు చెందిన షేక్ అబీద్, సూర్యాపేట జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిప్రోలు సురేశ్, ఇదే జిల్లా అనంతగిరికి చెంది న షేక్ షబీనా, కోదాడకు చెందిన షేక్ హు స్సేన్, నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ బీ, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెం దిన అనుమోలు అనిల్‌కుమార్, ఖమ్మం ప్ర శాంతనగర్‌కు చెందిన చాగంటి మణికంఠ, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెం దిన షేక్ ఫరీద్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపా రు.

నిందితుల నుంచి 8 తులాల బంగా రాన్ని సీజ్ చేశామన్నారు. వీరంతా పథకం ప్రకారం వృద్ధ దంపతులను నమ్మించి, వారి ఇంటిలోనే గదిని అద్దెకు తీసుకుని, హత్య చేశారని చెప్పారు. కృష్ణకుమారి ఒంటి మీద తోపాటు ఇంట్లో ఉన్న బంగారం, సెల్‌ఫోన్ తీసుకుని పరారైనట్టు సీపీ వివరించారు.