9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

నలుగురు మృతి కొండచరియల కిందే ఇంకా ఐదుగురు

02-03-2025 12:16 AM

డెహ్రాడూన్, మార్చి 1: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు కూలడంతో అందులో చిక్కుకున్న 55 మంది కార్మికుల్లో ఆర్మీ 50 మందిని రక్షించగా.. వారిలో నలుగురు మరణించారు. ఇంకా ఐదుగురు కార్మికులు ఆ చరియల కిందే ఉన్నారు. వీరిని కాపాడడటం కోసం ఆర్మీ ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తోంది.

బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై మంచును తొలగిస్తున్న సమయంలో మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు ఆ మం చు లో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారులు శుక్రవారం 33 మందిని, శనివారం 17 మందిని కాపాడారు. ఇంకా ఐదుగురు కార్మికులు ఆ మం చులోనే ఉండగా.. కాపాడిన వారిలో నలుగురు మృతి చెందారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మంచు చరి యలు విరిగిన ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీ. ఎత్తులో ఉంది.