16 July, 2026 | 12:22 AM

సిరీస్ పట్టేస్తారా ?

16-07-2026 12:00 AM

టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఉన్న భారత్ తొలి వన్డేలో అదరగొట్టి ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్ విజయమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. రోహిత్, కోహ్లీ ఫామ్ అందుకుంటారన్న అంచనాల వేళ గిల్, అక్షర్ పటేల్ మరోసారి మెరిసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. మరి కార్డిఫ్‌లోనే టీమిండి యా సిరీస్ పట్టేస్తుందా ?

  1. నేడు భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే
  2. 1 ఆధిక్యంలో టీమిండియా
  3. సిరీస్ సమం చేస్తామంటున్న ఇంగ్లాండ్
  4. తుది జట్టులో మార్పులు

కార్డిఫ్, జూలై 15 : గురువారం కార్డిఫ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాట్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోం ది. అటు సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకా ల్లో భాగంగా యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే, గెలుపు కాంబినేషన్‌ను కొనసాగించడంపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది.

తొలి వన్డేలో 80 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ గిల్,  కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. అయితే ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని, రెండో వన్డేకు అం దుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇ న్నింగ్స్ ప్రారంభించనున్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్, తన సహజసిద్ధమైన దూకుడు ఆటను ఆడేలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. అటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది.

వన్డే ప్రపంచకప్ కు ముందు జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టులో చోటు దక్కడం కష్టమేనని చెప్పొచ్చు. దీంతో రెండో వ న్డేలో రోకో జోడీ చెలరేగాలని అభిమానులు కోరు కుంటున్నారు. కాగా తొలి మ్యాచ్‌లో రోహిత్, విరాట్ కోహ్లి త్వరగానే అవుట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్య ర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్‌ను నిలబెట్టారు. రెండో వన్డేలోనూ ఇదే బ్యాటింగ్ లైనప్‌కొనసాగించే అవకాశం ఉంది.

కాగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ పిచ్ ప్రారంభంలో పేసర్లకు, స్వింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యం లో గుర్నూర్ బ్రార్ స్థానంలో, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేస్తే భారత్ పైచేయి సాధించే అవకాశముంటుంది. మరోవైపు తొలి వన్డేలో తప్పిదాలను పురవావృతం చేయకుం డా సిరీస్ సమం చేయాలని ఇంగ్లాం డ్ జట్టు ఎదురుచూస్తోంది.

తుది జట్ల అంచనా

భారత్ : గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, దూబే, సుందర్, అక్షర్ పటే ల్, బుమ్రా, అర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ

ఇంగ్లాండ్ : బెథెల్, డకెట్, రూట్, బ్రూక్(కెప్టెన్), బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, ఆర్చర్, డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్