16 July, 2026 | 12:22 AM

అగ్రస్థా నంపై కన్నేసిన గిల్

16-07-2026 12:00 AM
  1. మిఛెల్‌కు చేరువలో భారత కెప్టెన్
  2. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

దుబాయి, జూలై 15 : భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థా నంపై కన్నేశాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో గిల్ టాప్ ప్లేస్‌కు చేరువయ్యాడు. ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 80 పరుగులతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇ న్నింగ్స్‌తో అతని రేటింగ్ పాయింట్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ స్టార్ బ్యా టర్ డారిల్ మిచెల్ 814 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.గిల్ 803 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం మిచెల్‌కు, గిల్‌కు మధ్య కేవలం 11 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో వన్డే లో గిల్ కనుక మరోసారి అదరగొడితే మిచెల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్- వన్ వన్డే బ్యాటర్ కిరీటాన్ని సొంతం చేసుకుంటాడు. కాగా తాజా ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ ఆటగాళ్లు కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలవగా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నాలుగో స్థా నాన్ని కైవసం చేసుకున్నాడు.

అంటే వన్డేల్లో ప్రపంచ అత్యుత్తమ టాప్ బ్యాటర్లలో ముగ్గురు భారత ఆటగాళ్లే. ఇక ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఐదో స్థానం లో నిలిచాడు. మరోవైపు వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నంబర్- వన్ బౌలర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండో స్థా నంలో నిలవగా, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నా డు.

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగో స్థానంలో, శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ ఐదో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఆరో స్థానంలో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ ఏడో స్థానం లో నిలిచారు. భారత్ తరఫున చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకై క భారత బౌలర్‌గా నిలిచాడు. అటు తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్‌లో ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్ దూసుకొచ్చాడు.