30 June, 2026 | 10:17 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కోట్లాదిమంది కార్మికుల గొంతుకు ఉరిబిగిస్తారా?

17-03-2026 12:18 AM
  1. నాలుగు లేబర్ కోడ్లపై అసెంబ్లీ తీర్మానం చేయాలి

IFTU జాతీయ ఉపాధ్యక్షు లు సాదినేని,రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. సీతారామయ్య.

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16, (విజయక్రాంతి): ఏప్రిల్ ఒకటి నుండి దేశం లో నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయాలని మోడీ ఆదేశాలు ఇవ్వడం కార్మిక వ్యతిరేకమైనదని,కార్పొరేట్ల సంపద పెంపుకోసం 145 కోట్ల దేశ ప్రజలకు,70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధంకావడం దుర్మార్గమైనదన్నారు. నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మాణo చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు)జాతీయ ఉపాధ్యక్షు లు సాదినేని వెంకటేశ్వర రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య డిమాండ్ చేశారు.

ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యావత్తు కార్మిక వర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకి స్తూ సార్వత్రిక సమ్మెలను నిర్వహించి తమ వ్యతిరేకతను తెలియజేసినప్పటికీ మోడీ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాల కన్నా అంబానీ, అదాని లాంటి పిడికెడు మంది కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టటమే లక్ష్యంగా చేసుకొని నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయటానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. 

లేబర్ కోడ్లో యూనియన్ పెట్టుకొని హక్కును నిర్మూలించేందుకు, కనీస వేతనాలు లేకుండా చేసేందుకు,సమ్మెకు లేకుండా చేసేందుకు,కార్మిక వర్గానికి రక్షణ లేకుండా చేసేందుకు, ఎనిమిది గంటల పనిని 14 గంటలు మార్చేందుకు మహిళలతో అర్ధరాత్రి పనులు  చేయించేందుకు, పరిశ్రమల్లో కార్మికుల భద్రత రక్షణ కనీస మాత్రం కూడా అమలు చేయకుండా ఉండేందుకు,

కార్మిక శాఖ అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేందుకు లేబర్ కోడ్లు రూపొందించి ఉన్నారని  వారు తెలిపారు. కార్యక్రమoలో నాయకు లు ఎండి రాసుద్దీన్,డి.ప్రసా ద్,గౌని నాగేశ్వర రావు, తోడేటి నాగేశ్వర రావు, యన్.సంజీవ్,కొండపల్లి శ్రీనివాస్,ఎర్నం శ్రీను, యాసరపు వెంకన్న,రావురి ఉపేందర్ రావు,నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.