30 June, 2026 | 11:08 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఐకేపీ వీవోఏలకు రూ. 20వేలు వేతనం చెల్లించాలి

17-03-2026 12:16 AM
  1. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

జిల్లా కలెక్టర్‌కి వినతి

పాల్వంచ, మార్చి 16, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఐకెపి వివో ఏ లకు 20వేల రూపాయలు వేతనం చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఒక్క రూపాయి కూడా వివోఏలకు జీతం పెంచలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి విమర్శించారు .

ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఐకెపి వివో ఏ లకు వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానాలు నీటి మీద రాతలు లాగా మారాయని విమర్శించారు.

గత ప్రభుత్వం గ్రామ సంఘాల ద్వారా 3000 రూపాయలు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన వాగ్దానం కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.  సమస్యల పరిష్కారం కోసం శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం చర్చ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు .అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గారికి అందజేయడం జరిగింది.

ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వానికి కలెక్టర్ హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సిఐటియు  జిల్లా సహాయ కార్యదర్శి కె. సత్య తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష uhకార్యదర్శులు ఏ చంద్ర లీల, కృష్ణవేణి స-ఘ జిల్లా నాయకులు అనురాధ వెంకటలక్ష్మి రోజా కుమారి లక్ష్మీకాంత దుర్గ కవిత సుకన్య కళావతి లతా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.