1 August, 2026 | 12:04 PM

స్వతంత్ర అభ్యర్థిపై దాడి: పోలీసులకు ఫిర్యాదు

28-05-2024 12:59 AM

సూర్యాపేట, మే27 (విజయక్రాంతి): ఓటర్లకు డబ్బులు ఎలా పంచుతారని ప్రశించినం దుకు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ దాడికి గురయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో పోలింగ్ కేంద్రానికి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బలు పంపిణీ చేస్తున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ అక్కడికి చేరుకున్నారు. డబ్బులు పంచుతున్న వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్ నేతలు అశోక్ గౌడ్‌పై దాడి చేశారు. వీడియో చిత్రీకరిస్తుండగా ఆయన మొబైల్‌ను అపహరించారు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.