12 May, 2026 | 2:03 AM

విభిన్న కథాంశంతో..

12-05-2026 12:43 AM

హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టీడీ ప్రసాద్ వర్మ దర్శకత్వంలో ఎన్ మహేశ్వరి, పీ జ్యోతి నిర్మిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో అనురాగ్ హీరోగా నటిస్తున్నారు. సంతోష్, సాయి విక్రాంత్, అలీ, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి ముఖ్యతారాగణంగా ఉన్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవలో ప్రముఖ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, నిర్మాత కే అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఫణి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ టీడీ ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం” అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలు ఆర్; సంగీతం: టాన్ తేజ్; ఎడిటర్: సునీల్ కుమార్.