7 June, 2026 | 11:23 PM

మొరాకో మగువతో..

12-09-2024 12:00 AM

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మూవీ ‘విశ్వం’. ఈ సినిమా నుంచి ‘మొరాకో మగువా..’ అనే పాటను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ జర్నీని కిక్‌స్టార్ట్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ సాంగ్‌ను రాకేందు మౌళి రాయగా.. పృథ్వీచంద్ర, సాహితీ చాగంటి ఆలపించారు. ఈ పాటలో గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎలిగెన్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు.

దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్; సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్; రచన: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ; స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్. నిర్మాత: టీజీ విశ్వప్రసాద్.