17 March, 2026 | 4:20 AM

మిడ్ మానేరులో మహిళ మృతదేహం

16-10-2024 01:27 AM

సిరిసిల్ల, అక్టోబర్ 15: వేములవాడ పట్టణ పరిధిలోని అరెపల్లి సమీపంలో మిడ్ మానేరు బ్యాంక్ వాటర్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం మంగళవారం లభించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మహిళ వయస్సు 30 ఏళ్లు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే వేములవాడ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సీఐ పేర్కొన్నారు.