జగిత్యాల, అక్టోబర్ 15 (విజయక్రాంతి): తండ్రిని హత్య చేసిన కేసు లో కొడుక్కు జీవిత ఖైదు, రూ.5 వే ల జరిమానా విధిస్తూ జగిత్యాల జి ల్లా న్యాయాధికారి నీలిమ మంగళవారం తీర్పునిచ్చారు. జగిత్యాల జి ల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపల్లి గ్రామానికి చెందిన గ డుగు పోచయ్య పేరున ఉన్న రెండెకరాల భూమిని అమ్ముదామని నిర్ణ యించుకున్నాడు.
ఈ విషయంలో పోచయ్య కొడుకు ప్రభుదాస్ మధ్య తరుచూ గొడవలు జరిగేవి. అయినా కూడా భూమిని అమ్మడంతో కక్ష పెంచుకున్న ప్రభుదాస్ తండ్రిని హతమార్చాడు. గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేర కు విచారించిన జిల్లా న్యాయాధికారి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు.