8 July, 2026 | 5:04 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

20-03-2026 12:00 AM

60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ఎక్కి మహిళను ఓదార్చిన సబ్ కలెక్టర్

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం బుర్గల్ గ్రామంలో ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోతుండగా.. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ట్యాంకర్ పైకి ఎక్కి ఆమెతో మాట్లాడి కిందకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. గురువారం స్రవంతి అనే యువతి కుటుంబ విభేదాల నేపథ్యంలో గ్రామంలోని 60 అడు గుల ఎత్తున నీటి ట్యాంకర్ పైకి ఎక్కింది.

సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కిరణ్మయి 60 అడుగుల ట్యాంకర్ ఎక్కి స్రవ ంతిని ఓదార్చుతూ కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఆమెతో చర్చలు జరిపి, నమ్మకం కల్పిం చి సురక్షితంగా కిందికిదించేలా కీలక పాత్ర పోషించారు. ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు, సర్పంచ్ సమన్వయంతో యువతిని కిందికి దించారు.