20 March, 2026 | 7:37 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్

20-03-2026 12:00 AM

భద్రాచలం, మార్చి 19,  (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దంపతులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం నాడు ఉదయం స్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవస్థానం పర్యవేక్షకుడు సాయిబాబా మరియు అర్చక స్వాములు దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.

ముందుగా బలపీఠం వద్ద పూజలు నిర్వహించి, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి పట్టు వస్త్రాలు అందించి స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ ప్రసాద్ మరియు అర్చకస్వాములు తదితరులు పాల్గొన్నారు.