19 May, 2026 | 2:49 PM

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

19-05-2026 01:55 PM

 పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా దొరకని న్యాయం 

 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాక కూడా నిందితుల దౌర్జన్యం 

షాద్‌నగర్ మే 19 (విజయక్రాంతి): షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన ఎద్దు చెన్నమ్మ అనే దళిత మహిళ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎద్దు సురేష్ ఎద్దు నరేష్ లక్ష్మమ్మ అనిత స్వరూపలు ఇటీవలే చెన్నమ్మపై దాడికి పాల్పడ్డారు. ఇంటి మీదికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడుతూ..  బూతులు తిడుతూ తీవ్రంగా అవమానించారు. దీనిపై చిన్నమ్మ అతని కుమారుడు ఎద్దు సందీప్ తో కలిసి మూడు రోజుల క్రితం కొందుర్గు పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా వారిపై ఫిర్యాదు చేసింది.

యితే పోలీసులు ఈ వ్యవహారంలో సరైన రీతిలో స్పందించలేదని చెన్నమ్మ కుమారుడు సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఇచ్చాక వారిని పిలిపిస్తే కూడా రాలేదని ఆ తర్వాత కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో ఏం చేయాలో తెలియక తమను రక్షించేవారు ఎవరని బాధపడుతూ తన తల్లి చెన్నమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ సమయంలో ఇంట్లో ఉన్న ఒక శుభలేఖ కార్డుపై దాడి చేసిన వారి పేర్లు రాసి ఉరివేసుకొని చనిపోయిందని కుమారుడు సందీప్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.