25 July, 2026 | 12:37 AM

ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దహనం

25-07-2026 12:00 AM

తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా 

చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్

హనుమకొండ, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 11000 కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి,సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఏబీవీపీ కేయూ శాఖ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.

అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా కోర్సు పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోలేక, సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్స్ పొందలేక ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీ యాజమాన్యాల వేదింపులు భరించలేక, అవమానాలు భరించలేక అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలు, గడిచిన మూడు సంవత్సరాలుగా ఫుడ్ పాయిజన్, పాముకాటు, తేలు కాట్ల కారణంగా సుమారుగా 118 మంది పసిపిల్లలు, విద్యార్థులు మరణించారని, ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్, స్టేట్ యూనివర్సిటీ ప్రముఖ్ అంబాల కిరణ్, రాహుల్, సాయి, సిద్దు, కృష్ణ, శ్రీశైలం,అరవింద్, తదితరులు పాల్గొన్నారు.