25 May, 2026 | 10:19 AM

అనారోగ్య కారణాలతో మహిళ ఆత్మహత్య

25-05-2026 09:33 AM

హుజూర్ నగర్, (విజయక్రాంతి): అనారోగ్య కారణాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ యస్ఐ చలి కంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన దివ్వెల మహాలక్ష్మి (51) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న  ఆరోగ్యం కుదుట పడటం లేదని తీవ్ర మనోవేదన చెంది శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా గ్రామ పోలిమేరలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలు భర్త దివ్వెల రవిజనార్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యస్ఐ విలేకరులకు తెలిపారు.