10-09-2025 11:33:28 AM
హైదరాబాద్: వాహనాల అతివేగం ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తమకు సంబంధం లేకుండానే ఎంతో మంతి ఎక్కడ అక్కడ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఇది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి ఎగ్జిట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)లో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు మృతదేహం ఛాయాచిత్రాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. ప్రమాదంలో ఉన్న వాహనాన్ని గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.