10-09-2025 11:27:27 AM
హైదరాబాద్: భూస్వాముల దురాగతాలపై తిరగబడ్డ బహుజన ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma death anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆ వీరనారికి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి రేవంత్ రెడ్డి ఐలమ్మ నివాళలర్పించారు. అణచివేతపై ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) నివాళలర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం బహుజనుల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ ధీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ.. ఆమె వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నివాళులు.'' అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.