విష పదార్థం సేవించి మహిళ మృతి
నాగిరెడ్డిపేట్, జులై 19 (విజయ క్రాంతి): విష పదార్థం సేవించి మహిళ మృతి చెం దిన ఘటన తాండూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన మునిగేపల్లి రాజయ్య చిన్న కూతురు రెండు సంవత్సరాల క్రితం అంతర్ కుల వివాహం చేసుకోవడంతో కుటుంబంలో భార్య భర్తల మధ్య తరచూ మనస్పర్దాలు ఏర్పడడంతో 12వ తేదీన రాజయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళగా భార్య మునిగేపల్లి జయ వ్వ (50) ఇంట్లో తెలియని విష పదార్థం సేవించడంతో గమనించిన కుటుంబ స భ్యులు ఆమెను ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి త రలించారు. అక్కడినుండి సూరారంలోని ఆసుపత్రికి తరలించారాని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.
అక్కడ చికిత్స పొందినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో శనివారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.అదే రోజు రాత్రి జయవ్వ మృతి చెందినట్లు భర్త రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.






