18 March, 2026 | 12:08 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

కరెంట్‌షాక్‌తో మహిళ మృతి

04-12-2024 01:10 AM

కోదాడ, డిసెంబర్3: కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రూరల్ ఎస్సై అనిల్‌రెడ్డి వివరాల ప్రకారం.. కొమరబండకు చెందిన షేక్ నస్రీన్ (28) చిన్నారులకు స్నానం చేయించేందుకు వాటర్ హీటర్ పెడుతుండగా, విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే నస్రీన్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.