15 March, 2026 | 5:43 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

చేతులు కట్టేసి, వివస్త్రను చేసి మహిళపై అత్యాచారం

12-10-2025 03:39 AM
  1. ఆపై చంపేందుకు ప్రయత్నం
  2. మెదక్ జిల్లా చిన్నఘనాపూర్‌లో ఘటన

మెదక్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): చేతులు కట్టేసి, వివస్త్రను చేసి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు.. ఆపై హత్య కు యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని చిన్నఘనాపూర్ శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గం లో శనివారం వెలుగులోకి వచ్చింది. మెదక్ మండలానికి చెందిన మహిళ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి మెదక్‌లో అడ్డా కూలికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని దుండగులు ఆమెను ఏడుపాయల వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మహిళను వివస్త్రను చేసిన దుండగులు.. రెండు చేతులను కట్టేసి దాడికి పాల్పడి, చంపేందుకు యత్నించారని తెలుస్తున్నది.

శనివారం ఉదయం మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసన్నకుమార్, కొల్చారం ఎస్సై మొయినుద్దీన్, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. మహిళను పోలీసు వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.