02-11-2025 12:00:00 AM
అమీన్ పూర్ పీఎస్ పరిధిలోని వడకపల్లిలో ఘటన
అమీన్‌పూర్, నవంబర్ 1: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. సీఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు వడకపల్లి గ్రామ శివారులో ఉన్న వ్య వసాయ క్షేత్రంలో దంపతులు రాజు, సరోజని(38) పని చేస్తున్నారు. వీరికి 2005లో వివాహం కాగా వినోద, విశాల ఇద్దరు సంతానం.
మద్యం మత్తులో రాజు తన భార్యతో శుక్రవారం రాత్రి గొడవపడి కర్రతో సరోజినిపై దాడి చేయడంతో ఆమె మృతిచెందింది. సరోజని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రసాద్ అనే వ్యక్తి వద్ద ఆరు నెలల క్రితం పని చేయడానికి భార్యాభర్తలు చేరారని సీఐ తెలిపారు. తెలిపారు.