11-10-2025 05:51:19 PM
రాజస్థాన్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్‌లోని సికార్‌లోని సదర్ సికార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్వాస్ రోడ్‌లోని అనిరుధ్ రెసిడెన్సీలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... 34 ఏళ్ల మహిళ 2019లో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2020లో మరొకరిని వివాహం చేసుకుంది. అయితే, తన రెండవ భర్తతో వివాదం జరగడంతో ఆమె తన నలుగురు పిల్లలతో 18, 13 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు, 5, 3 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులతో విడివిడిగా నివసిస్తోంది. పెద్ద కుమార్తె, కుమారుడు ఆమె మొదటి వివాహంలోను, ఇద్దరు చిన్న పిల్లలు రెండవ వివాహంలోను జన్మించారు.
గత కొన్ని రోజుల ఫ్లాట్ నుండి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల ప్లాట్ తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో ఐదు మృతదేహాలు కనిపించాయి. దాదాపు వారం రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో అనుమానిత విష ప్యాకెట్లు దొరికాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరిక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం పరీక్షల తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.