11 March, 2026 | 6:20 AM

భవనం నిర్మాణం పూర్తి చేసి.. కూల్చివేతలు జరపాలి

09-03-2026 12:26 AM

సికింద్రాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఏలివెటెడ్ కారిడార్ రోడ్డు విస్తరణలో భాగంగా  బోయినపల్లి ప్లే గ్రౌండ్లో స్థలంలోని  రేజ్లింగ్, జిమ్, కంప్యూటర్ గదులు కూల్చి వేయనుండడంతో క్రీడాకారుల కోసం గతం లో ఉన్న వసతులు కనుమరుగయ్యే అవకాశం ఉందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. భవనం నిర్మాణం జరిగిన అనంతరం కూల్చివేతలు జరపాలని జంపన ప్రతాప్ కోరారు.

నిర్మాణానికి ఎమ్మెల్యే,  సీఈఓ అరవింద్ కుమార్ త్రివేది, డీఈవో దినేష్ రెడ్డిలు సహకారం అందజేస్తున్నారని వారికి జంపన ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి జగదీష్ మాట్లాడుతూ క్రీడాకారులకు వసతులు కల్పించేందుకు జంపన ప్రతాప్ కృషిచేయడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమంలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్ జైరాజ్, సత్యనారాయణ,జగదీష్,రేజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్,బండి శ్రీనివాస్, యాదగిరి,కరణ్ సింగ్, సురేష్, వాసు గౌడ్, శశి, చొటు పాల్గొన్నారు.