కబ్జాలపై అధికారుల చర్యలు ఉండవా?

17-09-2026 | 05:10am

విద్యా వ్యాపారవేత్తల ఆగడాలపై ఇబ్రహీంపట్నంలో మండిపడుతున్న స్థానికులు

సెలవుల సాకుతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఇబ్రహీంపట్నం నియోజకవర్గ(Ibrahimpatnam Constituency) పరిధిలో విద్యా వ్యాపారవేత్తలు, బడా రియల్ ఎస్టేట్(Major Real Estate) ముఠాలు బరితె గించి ప్రభుత్వ భూములను(Government lands) నొక్కేస్తున్నాయి. అధికారుల ఉదాసీనత, పరోక్ష సహకారంతోనే కోట్లాది రూపాయల విలువైన సర్కారు స్థలాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖానాపూర్ సర్వే నంబర్ 67లో 20 ఎకరాలు కబ్జా?....

ఖానాపూర్ రెవెన్యూ(Khanapur Revenue) పరిధిలోని సర్వే నం బర్ 67లో సుమారు 33 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉంది. అయితే, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం(Guru Nanak Engineering College Management)తో పాటు పలువురు బడా వ్యాపారులు తమ పట్టా భూములను చూపిస్తూ, వాటి సరిహద్దులను దాటి ఏకంగా 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై గతం లో అనేకసార్లు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా, వారు మౌ నం వహించడమే అక్రమార్కులకు వరంగా మారింది.

బోర్డులు మాయం.. చర్యలు శూన్యం....

గతంలో సర్వే నంబర్ 80 మరియు సర్వే నంబర్ 67 పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు స్థానికుల విన్నపం మేరకు రె వెన్యూ అధికారులు ‘ఇది ప్రభుత్వ స్థలం‘ అ ని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపించడం తో, కబ్జాదారులు రాత్రికి రాత్రే ఆ బోర్డులను అర్ధాంతరంగా తొలగించారు. సర్కారు బోర్డులనే తొలగించిన అక్రమార్కులపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసులు గానీ, చట్టపరమైన చర్యలు గానీ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

వరుస సెలవులే ఆసరాగ దందాలు..

ఇటీవల వచ్చిన వరుస సెలవులను ఆసరాగా చేసుకుని కబ్జాదారులు మళ్లీ ఆక్ర మణలకు తెరలేపారు. సెలవు రోజుల్లో అధికారులు అందుబాటులో ఉండరనే ధీమాతో సరిహద్దు రాళ్లను జరపడం, కొత్తగా కంచెలు వేయడం వంటి పనులు వేగవంతం చేశారు.

ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు:

రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డులు మాయమైనా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?, గతంలో గుర్తించిన నివేదికల ప్రకారం భూములను వెంటనే స్వాధీనం చేసుకుంటారా?, 

హెచ్చరిక బోర్డులను పునరుద్ధరించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేక అక్రమార్కులకు సహకరిస్తూ కాలయాపన చేస్తారా?...ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందిం చి ప్రత్యేక సర్వే బృందాలతో సమగ్ర విచారణ జరిపించాలని, ఆక్రమణకు గురైన కో ట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడాలని ఇబ్రహీంపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు