calender_icon.png 26 May, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం పని చేయాలి

26-05-2025 12:15:45 AM

జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మానవ హక్కుల కమిటీ సభ్యులు ప్రజా సమస్యల కోసం పనిచేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర చైర్మన్(National Human Rights Committee State Chairman) బద్దిపడగ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల మినీ ఫంక్షన్ హాల్ లో జిల్లా కమిటీ చైర్మన్ రాథోడ్ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు.

మానవ హక్కులకు భంగం వాటిల్లే చర్యలు ఎక్కడ జరిగిన వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంస్థ యొక్క విధి విధానాలు లక్ష్యాలను సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో జాతీ య మానవ హక్కుల కమిటీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహిపాల్, ఈసీ మెంబర్ రామచంద్రరావు, రాష్ట్ర కో కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ నైతం మోహన్, రాథోడ్ గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం భానుచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చౌరే మహేష్, జిల్లా కమిటీ సభ్యులు మండల సభ్యులు పాల్గొన్నారు.