26-05-2025 12:15:22 AM
ముషీరాబాద్, మే 25 (విజయ క్రాంతి) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్(ఐఎస్టీఎం), కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)లతో కలిసి సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్(టీఓటీ) సర్టిఫికేషన్ కోర్సు నగరంలోని ద గౌడియం స్కూల్లో ప్రారంభమైనట్లు గౌడియం స్కూల్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కీర్తిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ విద్యావిధానం 2020 ఫ్రేంవర్క్ ప్రకారం ఉపాధ్యా యులు సీఈఎస్‌ఈ రిసోర్స్ పర్సన్లుగా పనిచేసేందుకు ఈ టీఓటీ కోర్సు ఉపయోగ పడుతుందన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి 76 మంది హాజరైనట్లు తెలిపారు.