26-05-2025 12:17:03 AM
చార్మినార్, మే 25(విజయక్రాంతి) : పాత నగర మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సమావేశం ఆదివారం హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మందిరంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయ ఊరేగిం పు కమిటీలోని వివిధ దేవాలయాల ప్రతినిధులు పాల్గొని నూతన ఉమ్మడి దేవాలయా ల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడిగా జి.రాఘవేందర్ ని ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షుడు యం.మారుతి యాదవ్, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం అధ్యక్షుడు జె.మధుసూదన్ గౌడ్, అక్కన్న మాద న్న మహంకాళి దేవాలయం అధ్యక్షుడు జగ్మోహన్ కపూర్, హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం అధ్యక్షుడు ఏ.రాజేష్, బేల ముత్యాలమా దేవాలయ కమిటీ ప్రతినిధి పోటెల్ సబోధ్ యాదవ్, సుల్తాన్ షా హి శ్రీ జగదంబ దేవాలయం ప్రతినిధి శశాంక్ తివారి,ప్రతినిధులు మధుసూదన్ యాదవ్, గురునాథ్ రెడ్డి, జి.అరవింద్ కు మార్ గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్, అదర్ల మహేష్, ప్యారసాని వెంకటేష్, రాందేవ్ అగర్వాల్, కె.దినేష్, శ్రీధర్ యాదవ్, వై.నరేష్, ఆకుల వేణుగోపాల్, సి.శ్యామ్ రావు, అశోక్ కుమార్, ఏం.అజయ్ కుమార్, జి.నవీన్ కు మార్, కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.