calender_icon.png 25 December, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయండి

24-12-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్,డిసెంబర్‌౨3(విజయక్రాంతి): సర్పం చ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో బిజెపి మద్దతు దారులు గెలుపొందిన స్ఫూర్తితో వచ్చే ఎంపీటీ సీ జడ్పిటిసి ఎన్నికల్లో మెజార్టీ స్థానాల దక్కిం చుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండ లం హనుమాన్ తండా గ్రామ సర్పంచ్ పవర్ పుష్పలత జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ పవర్‌రాజేష్ ఉప సర్పంచ్ ప్రహ్లాద్‌తో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మహేశ్వర్‌రె డ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, కంకేట సర్పంచ్ సోహెబ్, చెన్న రాజేశ్వర్ పాల్గొన్నారు. అంతకుముందు వివిధ గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యేలను కలిసి పుష్పగుచ్చం అందించారు.