calender_icon.png 25 December, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితంపై పట్టు సాధిస్తేనే మంచి భవిష్యత్తు

24-12-2025 12:00:00 AM

నిర్మల్, డిసెంబర్ ౨3 (విజయక్రాంతి): ఏ విద్యార్థి అయినా గణితం పై పట్టు సాధించినప్పుడే భవిష్యత్తు బాగుంటుందని ఆల్ఫోన్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత పోటీ పరీక్షలో విజేత అయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో అల్ఫోర్స్ సంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ రామానుజన్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, గణితం ప్రతి రం గంలో విజయానికి పునాది అని పేర్కొన్నారు.

దూరదృష్టి ఫలితాలను పెంపొందిస్తుంది అనే విలువలతో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశా రు. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.