25 June, 2026 | 2:29 AM

పనుల్లో వేగం పెంచాలి

14-06-2024 01:41 AM

కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, జూన్ 13 (విజయక్రాంతి): అమ్మ ఆదర పాఠశాలల కింద చేపట్టిన మరమ్మత్తు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కోనరావుపేట మండలం కొలనూర్ లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను గురువారం అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య ఎంత, బడి బాటలో కొత్తగా ఎన్ని ప్రవేశాలు జరిగాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోనరావుపేటలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం, ధర్మారం రాంనగర్‌లోని స్కూళ్లలో చేపట్టిన పనులను పరిశీలించారు. ధర్మారంలో మిషన్ భగీరథ సిబ్బంది చేస్తున్న ఇంటిoటి సరేను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎన్ని పూర్తి అయ్యాయో తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై స్థానిక మహిళలతో మాట్లాడి, రోజు ఎన్ని గంటలు నీళ్లు వస్తున్నాయో తెలుసుకున్నారు.