60 మంది మైనర్లకు కౌన్సిలింగ్
14-06-2024 01:41 AM
కరీంనగర్ సిటీ, జూన్ 13: కరీంనగర్ పట్టణంలో బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 60 మంది మైనర్లకు గురువారం టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్ర మాదాలకు గురవుతున్నారని, కొన్ని సందర్భా ల్లో ప్రమాదాలకు కారణమవుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడంతో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని, మరోసారి పట్టుబడితే మైనర్లు నడిపిన వాహనాల యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కరీముల్లా ఖాన్, స్వామి, ఎస్‌ఐలు ఇసాక్, శనిగల శ్రీకాంత్, తదితరులున్నారు.






