వైభవంగా పోచమ్మ బోనాలు
14-06-2024 01:42 AM
జగిత్యాల, జూన్ 13 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని నూకపల్లి, కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రజలు పోచమ్మ బోనాల పండుగను గురువారం నిరహించారు. మహిళలు బోనాలను ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పోచమ్మ ఆలయానికి వెళ్లి, అమ్మవారికి సమర్పించారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.






