31 March, 2026 | 1:32 AM

కార్మికులు కాని.. కార్మికులు.!?

31-03-2026 12:00 AM

సింగరేణిలో కొత్తతరం కార్మికుల్లో కార్మిక స్పృహ కనిపించడం లేదు. తొలితరం కార్మికుల పోరాట వారసత్వం ప్రశ్నార్ధకం అయ్యింది. వారసత్వ ఉద్యోగాలు, పోరాటాలు సింగరేణిలో కనుమరుగైంది. పోరాటాల కొలిమిగా ప్రసిద్ధిగాంచిన సింగరేణి తొలితరం కార్మికుల శకం ముగిసిపోవడంతో పోరాట వారసత్వం అటుంచితే, కొత్త తరంలో కనీస కార్మిక స్పృహ జాడే కరువైంది. సంస్కరణల బలంతో  సింగరేణిలో కంపెనీ అధికారులు జులుం పెరిగిపోయింది. తొలితరం పోరాట వారసత్వాన్ని అందుకోలేపోతున్నారు. ఈ పరిస్థితి కార్మిక రంగానికి అత్యంత పెను ప్రమాదకరం. 1991లో సింగరేణిలో ప్రవేశించిన అప్పటి ఆర్థిక పారిశ్రామిక విధానాలు సింగరేణిలో పోరాట సంస్కృతిపై ప్రతికూల ప్రభావ ఫలితమేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఆర్థిక సంస్కరణలు సింగరేణిలో చాపకింద నీరులా కార్మిక సంస్కృతిని, సింగరేణి ఉపాధి కల్పవల్లిని నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. ఈ ప్రమాదాన్ని  ఎవరూ సరిగా గుర్తించనూ లేదు. గుర్తించినమని చెప్పుకొంటున్న విప్లవ కార్మిక సంఘాలు, పారిశ్రామిక విధానాల గుట్టును విప్పడం వరకే పరిమితమయ్యారు. ఈ నిర్లక్ష్యం భావితర కార్మికులపై పడింది. దీంతో సింగరేణిలో కొత్తతరం పోరాట వారసులను కోల్పోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఈ పరిణామాలు కార్మిక ఉద్యమాలకు అత్యంత విఘాతంగా మారాయి.

  1. నవతరంలో కార్మిక నిస్పృహ 
  2. సింగరేణిలో కార్పొరేట్ కల్చర్ 
  3. సింగరేణికి జన్మనిచ్చిన భూగర్భ గనులకు సమాధి 
  4. ఓపెన్ కాస్ట్‌లకే పెద్దపీట.. 
  5. కార్మిక రంగం ఉనికి ప్రశ్నార్థకం
  6. పోరుబాట వీడిన సంఘాలు 

బెల్లంపల్లి, మార్చి 30: సింగరేణిలో సంస్కరణల ప్రమాదమాన్ని ఎదుర్కొనడంలో కార్మి క సంఘాలు వైఫల్యం చెందారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ సంఘాలు సహజంగానే వాటి ఉచ్చులోకి దిగబడిపోయా యి. సంస్కరణల పట్ల స్వభావికంగా ఆ సం ఘాలకు పెద్దగా కార్యచరణ అంటూఎమీ లే దని విమర్శలున్నాయి. ఈ బాధ్యత విప్లవ కార్మిక సంఘాలపైనే ఉంది.

విప్లవ కార్మిక సంఘాలకు పారిశ్రామిక విధానాల ప్రమాదం తెలిసినప్పటికీ, కార్యచరణ లోపం, బలమైన మిలిటెంట్ పోరాటాల వైపు కార్మికులను మళ్ళించకుండా ఉండిపోయారనే విమర్శలు ఉన్నాయి. చేతులెత్తేసి నిమిత్తమాత్రంగా ఉండిపోయారనే విమర్శలు కాదన లేనివి. వాటిని ఎదుర్కోలేనీ ఫలితంగా సింగరేణిలో పోరాట సంస్కృతి చైతన్యం కాస్తా నిర్వీర్యమైయ్యింది. 

గుర్తింపు ఎన్నికల మర్మం..

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు పారిశ్రామిక విధానాల్లో భాగంగానే వచ్చాయి. ఈ విషయాన్ని మరిచిపోయినా కార్మిక సంఘాలు అధికార యావలో పడిపోయాయి. గెలిచిన గుర్తింపు సంఘాన్ని కోడ్ అప్ డిసిప్లిన్ తో కట్టడిచేసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ తరువాత పారిశ్రామిక విధానాలు అమలుకు శ్రీకారం చుట్టారు. వాటి గైడ్ లైన్స్ కు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను సాఫీగా అమలు చేస్తూ వచ్చింది.

ఇప్పటికీ అవే విధానాలు అమలవుతున్నాయి. సింగరేణి ఎన్నిక లు కార్మిక సంఘాలకు ఉనికిలేకుండా చేశా యి. గెలిచిన సంఘం కంపెనీ చట్రంలో బందీ కాగా ప్రతిపక్ష సంఘాల అస్తిత్వం ప్రశ్నార్ధకం అయ్యింది. ఈ పరిస్థితి కాలచక్రంలా అన్ని సంఘాలను నిస్సహాయంగా మార్చేశాయి. ఫలితంగా సింగరేణిలో పరిస్థితులు మునుపెన్నడూ లేనంత విషమంగా మారిపోయాయి. కార్మికులు హక్కులు, సంక్షేమం లేకుండా పోయింది.

కార్మికులు కట్టు బానిసలయ్యారు. కార్మిక సంఘాల్లో పోరాట స్పృహ నానాటికి పూర్తిగా నీరుగారిపోయింది. జాతీయ సంఘా లు పోరాట స్రవంతికి దూరమై పైరవీలకే పరిమితమయ్యాయన్న విమర్శలు  ఉన్నాయి. కం పెనీకి  అనుకూల ఈ సమయంలో కొత్త బొగ్గు గనుల మాటే బంగారమైంది. ఓపెన్ కాస్ట్ లకే పెద్దపీట వేస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెండుగా చేజారిపోయాయి.

దీంతో సింగరేణి నిరుద్యోగుల కార్ఖానాగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఎన్నడూ లేనివిధంగా తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతు న్నది. ఒకప్పుడూ సింగరేణిలో 1,20,000 మంది కార్మికులు ఉండేవారు. అలాంటిది  ప్రస్తుతం 35 వేలకు చేరింది. సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం సింగరేణి కంపెనీ తిరో మనాన్నీ సూచిస్తుంది. 

బొగ్గు బ్లాక్‌ల వేలం...

సంస్కరణల నేపథ్యంలో సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తి, సార్వభౌమత్వాన్ని కోల్పోయింది. ఫలితంగా భూగర్భ గనులు, డిపార్టుమెంట్లు ప్రైవేటీకరణ ఉచ్చులోకి పడి పోయాయి. బొగ్గు గనులు సింగరేణి మనుగడకు పనికిరానీవిగా చేశారు. కుక్కను చంపాలంటే పిచ్చిగా ముద్ర వేసి చంపాలనే.. పాలసీని సింగరేణి కంపెనీ భూగర్భ గనుల విషయంలో అమలు చేసింది. గత పదేళ్ల కాలంలో సింగరేణిలో ఒక్క అండర్ గ్రౌండ్ మైన్ ఊసేలేదు.

ఈ పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఓపెన్ కాస్ట్ గనులే తవ్వారు. కొత్తవాటీకి సన్నాహాలు చేశారు. మొత్తంగా సింగరే ణినీ ఓపెన్ కాస్ట్‌ల కోసం గ్రౌండ్ వర్క్ చేసిపెట్టారు. సింగరేణికి జన్మనిచ్చిన భూగర్భ గను లకు సమాధి కట్టారు. వేలాది కార్మిక బిడ్డలకు ఉద్యోగావకాశాలను మృగ్యం చేసి రోడ్డుపాలు చేశారు. సింగరేణి ఎలా ఆవిర్భించిందనే చారిత్రక సత్యాన్ని కాలగర్భంలో కలిపారు.

దీంతో సింగరేణిలో అండర్ గ్రౌండ్ గనులు చరిత్రగానే  నిలిచిపోయాయి. కార్పొరేట్ శక్తులకు సింగరేణి బొగ్గు సంపదను వేలం పేరిట    అప్పజెప్పుతున్నారు. సింగరేణి సంపదను కార్పొరేట్ మూకలు  కొల్లకొడుతున్నారన్న విమర్శలు పెల్లుబికితున్నాయి. బొగ్గుబ్లాకుల  వేలంతో కార్పొరేట్ శక్తులకు సింగరేణిలో స్వాగతం పలుకుతున్నారు. ఫలితంగా  ఉపాధి అవకాశాలకు గుదిబండగా మారిపోయాయి.

సింగరేణిలో కనీవిని ఎరుగని రీతిలో నిరుద్యోగం తాండవిస్తోంది. కొత్త ఉద్యోగాలకు దారులు పూర్తిగా  మూసుకుపోయాయి. అం తే కాకుండా వారసత్వ ఉద్యోగాలు లేకుండా పోయాయి. అరకొరగా కారణ్యం, మెడికల్, ఆక్సిడెంట్ పర్పస్‌లో ఉద్యోగాలు లభిస్తున్నా యి. ఇటీవల అవికూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇందులో కారుణ్యం కోసం నిర్వహించే మెడికల్ బోర్డును నిలిపేశారు.

కారుణ్య నియామకాలు పూర్తి అవినీతి మాయమైపోయాయి. ఇప్పటివరకు లభిస్తోన్న  ఉద్యోగాలు కూడా సన్నగిల్లిపోయాయి. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారన్న  విమర్శలు ఉన్నాయి. సింగరేణిలో మళ్ళీ కార్మికులను తగ్గించాలనే వ్యూహానికి మరోసారి పదును పెడుతున్నారు. కొత్త ఉద్యోగాలు అటుంచితే ఉన్న ఉద్యోగులను తగ్గించే సరికొత్త  కుట్రలకు తెరతీస్తున్నారు. ప్రపంచీకరణ భూతం సింగరేణి సంస్థ, కార్మికులను అనేక వైపులా నుంచి వినాశన పర్చుకుంటూ వస్తున్నది.

భవిష్యత్ అంధకారమే..

సింగరేణి ప్రస్తతం ఆపదకాలంలోనే ఉంది. కార్మిక సమూహం సంస్కరణల ఇనుప గొలుసుల బంధిఖానలో ఉంది. ఈ నేపథ్యంలో పోరాట చైతన్యం ఉన్న పాతతరం కార్మిక వర్గం విశ్రాంతిలోకి వెళ్ళడం, వారి స్థానంలో వచ్చిన నవత రం సంస్కరణలు బిగించిన ఉక్కు కౌగి ట్లో చిక్కుకుపోయిoది. దానికి తోడు స్వత గా యువ కార్మికుల్లోనూ కనీసం కార్మిక స్పృహలేకుండా పోయింది. నవతరం కార్మికుల చైతన్య రాహిత్యం సింగరేణి కం పెనీకి కలిసోచ్చిన అవకాశంగా మాల్కుకున్నది. ఈ నేపథ్యంలో పోరాటాల్లో అలు పెరగని  సింగరేణిలో ప్రస్తతం నిశబ్దం ఆవరించింది.

ఈ క్రమంలో సింగరేణిలో అడుగుపెట్టిన  కొత్తతరం కార్మికులు రాజీ ధోరణి రొంపిలో పడిపోయారు. పోరాటాల వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు. ఉద్యోగ, సౌలభ్యం కోసం పైరవీ కారులను ఆశ్రయిస్తున్నారు తప్పితే తిరుగుబా టు బావుట ఎత్తడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా రాజీమార్గంలోనే కూరుకు పోతున్నారు. వారలా కావడానికి జాతీ య కార్మిక సంఘాలు వారిని పైరవీలకు ఎరగా మలుచుకున్నారన్న విమర్శలు కోకొల్లలు.

అంపశయ్యపై ఉన్న సింగరేణి పరిరక్షణ పోరాటంలోనే తమ జీవన భద్రత, వికాసం ఉన్నదనే  చైతన్య స్పృహ కొత్త తరం కార్మికుల్లోనూ రావలసిన అవసరం ఉంది. నవతరంపైనే సింగరేణి సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సర్వత్యాగాలకు సిద్ధపడే పోరాటాల కాలమిది.. మౌనం క్షంతవ్యం ఎంత మాత్రం కాదని మేధావులు పేర్కొంటున్నారు.