20 May, 2026 | 8:07 PM

క్షేత్రస్థాయి పర్యటనలో శిక్షణ డిపిఓలు

20-05-2026 06:37 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఎంపిక చేసిన జిల్లా పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారులుగా (డిపిఓ) ఎంపిక అయిన వారిని గ్రామాల అభివృద్ధిపై క్షేత్రస్థాయి  పర్యటనకు బుధవారం తీసుకువచ్చారు.

జిల్లా పంచాయతీ అధికారులుగా ఎంపికైన శిక్షణ డిపిఓలు  ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్  రిటై విట్టల్ ను పంచాయతీ పాలనపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి  పాలకవర్గ సమావేశం, గ్రామ సభల వివరాలు  సర్పంచ్ ద్వారా తెలుసుకున్నారు. శిక్షణ డిపిఓలతో  పాటు డి ఎల్ పి ఓ  లు ఫణిధర్ రావు, ప్రభాకర్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.