14 May, 2026 | 1:11 AM

సర్పంచ్, కౌన్సిలర్లకు విద్యపై వర్క్‌షాప్

14-05-2026 12:37 AM

జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు సమక్షంలో ఎనమిది అంశాలపై వర్క్‌షాప్

ముడిమ్యాల జీపీఆర్ కన్వెన్షన్‌లో నియోజకవర్గస్థాయి సమావేశం

చేవెళ్ళ మే 13(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యావారోత్సవాలు నియోజకవర్గ స్థాయిలో (చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబుపేట్) మండలాలలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లకు బుధవారం వర్క్ షాప్ నిర్వహించారు.

పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్యార్థుల సంక్షేమం, యువత క్రీడలు, పిల్లల భద్రత, కేజీబీవీ పాఠశాలల అభివృద్ధి, నాణ్యమైన భోదన, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి ఎనమిది అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యరు. వారు మాట్లాడుతూ... సర్కార్ పాఠశాలలకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను, సౌకర్యాలను గుర్తు చేసారు.

అదేవిదంగా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రవేశపెట్టి వారికీ కావాల్సిన సదుపాయాలను అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు మాట్లాడుతూ... సర్పంచ్ లు, కౌన్సిలర్ లు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి, మొయినాబాద్ చైర్మన్ సానియా దర్శన్, శంకర్పల్లి చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, చేవెళ్ల ఆర్ డిఓ పార్థసారథి, ఆయామండలాల ఎంపీడీఓస్, తహసిల్దార్స్ అన్ని మండలాల ఎంఈఓలు, అన్ని మండలాల సీఆర్ పీలు, పాల్గొన్నారు.