14 May, 2026 | 1:40 AM

ప్రశాంతంగా పాలిసెట్

14-05-2026 12:36 AM

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిటెక్నిక్ కామన్‌ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) బుధవారం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగింది. 1.06 లక్షల మంది విద్యార్థులకు నమోదు చేసుకోగా లక్షకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు వచ్చిన విద్యా ర్థులను సిబ్బంది తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంది.