9 April, 2026 | 8:56 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు

26-09-2024 06:21 PM

అధికారులకు కలెక్టర్ హనుమంత్ కే జండగే 

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): వయోవృద్ధుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పోస్టర్ ను విడుదల చేశారు. వచ్చే అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలలో వయోవృద్ధుల రక్షణ,  వారి హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనాధలైన వయోవృద్ధులను గుర్తించి వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి కే.నరసింహారావు, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సభ్యులు రిటైర్డ్ ఎంప్లాయిస్ బాలేశ్వర్, చంద్రశేఖర్, సోమన్న,  రమేష్, జ్ఞానేశ్వర్, బిక్షపతి, సిడిపిఓలు శ్రీమతి శైలజ, జ్యోత్న్స, స్వరాజ్యం, రమ,  సమీరా మీర్జా, మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.