ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కోటపల్లి, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎడగట్ట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డోంగ్రి రాజేశ్వరి మల్లేష్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ సమతుల్యతకు చెట్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఉప సర్పంచ్ సింక్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బెజ్జూర్‌లో..
బెజ్జూర్, జూన్ 5 (విజయ క్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని రేంజ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అటవీ అధికారి బాలమణి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.అనంతరం రేంజ్ పరిధిలో పర్యవేక్షణలో భాగంగా కృష్ణపల్లి సెక్షన్లోని రాముడు, భీముడు టేకు చెట్లను పరిశీలించారు.
బేస్ క్యాంపును సందర్శించి అక్కడి పరిస్థితులు, నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్డీవో అప్పయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు షాపీయా బేగం, సంతోష్, మనోహర్,సిబ్బంది పాల్గొన్నారు.






